BHANEWS TELUGU fresh news


Polls

ఐటీ సేవల రంగంలో మనం ముందంజలో ఉన్నాం. ఈ రంగం ఏటా పది శాతం వృద్ధి చెందుతుండగా లక్షల కుటుంబాలు వీటిపై ఆధారపడి బతుకుతున్నాయి. ఈ రంగంలో కంపెనీలకు అత్యధిక ఆదాయం, ప్రాజెక్ట్‌లు అమెరికా, అక్కడి కంపెనీల నుంచే రావాలి. అమెరికాతో పోల్చితే జీతాలు, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం మెరుగైన మానవ వనరులు లభ్యమవుతుండటంతో అక్కడి సంస్థలు ఎక్కువగా భారతపై ఆధారపడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి కంపెనీలకు చెందిన నిపుణులైన ఉద్యోగులు అమెరికాకు వెళ్లి అక్కడ సంస్థ తరుపున పని చేయాల్సి ఉం టుంది. ఇలా ఏటా లక్షల మంది భారత నుంచి అమెరికాకు వెళ్తుంటారు. ఇలా వెళ్లేవారికి హెచ్‌1బీ, ఎల్‌1 వీసాలు కీలకం. ఈ నేపథ్యంలో వాటిపై ఆంక్షలు విధిస్తే భారత నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయి.. ఆ ప్రభావం ఐటీ సంస్థలపై పడే అవకాశముంది. మరోవైపు అక్కడ ఉన్న తమ కార్యాలయాల్లో అమెరికన్లను నియమించాలంటే వారికి అధిక వేతనం ఇవ్వాలి. దీంతో హెచ్‌1బీ వీసాల నిబంధనలు కఠినతరమైతే రూ.100000 కోట్ల పరిశ్రమ కాస్త ఇబ్బందుల్లో పడే అవకాశముంటుంది